సంపులో పడి కన్నుమూసిన చిన్నారి
ఆడుకుంటున్న ఓ చిన్నారి సంపులో పడి దుర్మరణం పాలైన సంఘటన ఫరూక్‌నగర్ మండలం కందివనంలో చోటుచేసుకుంది.
భవ్యశ్రీ
షాద్‌నగర్: ఆడుకుంటున్న ఓ చిన్నారి సంపులో పడి దుర్మరణం పాలైన సంఘటన ఫరూక్‌నగర్ మండలం కందివనంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నాగేష్, పల్లవిల కూతురు భవ్యశ్రీ(4) గురువారం ఉదయం ఇంటి ముందు ఆడుకొంటూ అదృశ్యమైంది. పాప కోసం కుటుంబ సభ్యులు సుమారు 4 గంటల పాటు వెతికారు. సుమారు 12 గంటల ప్రాంతంలో పక్కింటిలోని సంపులో పాప మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు పాప నీటిలో పడి మృతి చెందిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ దంపతులకు ఒక కొడుకు, కూతురు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్
-
India News
National News:మైనర్లను పెళ్లాడిన 2,044 మంది అరెస్టు