వదినపై కన్నేసిన మరిది
వదినను వివాహం చేసుకుంటానని వెంబడించాడు. వేధించాడు. నిరాకరించడంతో.. కత్తితో దాడికి తెగబడిన ఘటన కేశంపేటలోని పీహెచ్‌సీలో గురువారం చోటుచేసుకుంది.
వివాహం వద్దన్నదని ఘాతుకం
కేశంపేట, న్యూస్‌టుడే: వదినను వివాహం చేసుకుంటానని వెంబడించాడు. వేధించాడు. నిరాకరించడంతో.. కత్తితో దాడికి తెగబడిన ఘటన కేశంపేటలోని పీహెచ్‌సీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన యువతి(23) షాద్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ పీహెచ్‌సీలో పనిచేస్తోంది. ఆమె చెల్లిని ఆటోడ్రైవర్ సభావట్ కిషన్(35) ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య అక్కను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి ఆమె ఆసుపత్రిలోనే పడుకుంది. గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోకి వచ్చిన కిషన్ వదినపై కత్తితో దాడి చేశాడు. తోటి సిబ్బంది ఆమెను రక్షించారు. అతన్ని గదిలో బంధించి పోలీసులకు తెలిపారు. వారు వచ్చేలోపు అతడు పారిపోయాడు. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Spy Balloon: గుబులుపుట్టిస్తున్న చైనా నిఘా నీడ.. అమెరికాలో కన్పించిన రెండో బెలూన్
-
General News
Telangana Assembly: 6న తెలంగాణ బడ్జెట్.. అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్
-
Sports News
Rohit-Virat: రోహిత్, విరాట్.. ఇద్దరూ టీ20 ప్రపంచకప్‌లో ఆడడం కష్టమే..!: వసీం జాఫర్
-
Movies News
Kangana Ranaut: కియారా-సిద్ధార్థ్ వివాహం.. కంగన పొగడ్తల వర్షం
-
World News
Chile: చిలీలో కార్చిచ్చు.. రోడ్లపైకి దూసుకొస్తున్న అగ్నికీలలు..13 మంది మృతి
-
Politics News
Kotamreddy: సజ్జల గుర్తుపెట్టుకో.. నాకు ఫోన్‌కాల్స్ వస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయ్: కోటంరెడ్డి