BRS: నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం: కేసీఆర్‌

దేశ రాజధాని దిల్లీలో 14న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS) కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది భారాస నినాదమని చెప్పారు.

Updated : 09 Dec 2022 18:12 IST

హైదరాబాద్‌: దేశ రాజధాని దిల్లీలో ఈనెల 14న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)(BRS) కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ తెలిపారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది భారాస నినాదమని చెప్పారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 

‘‘నా ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణం. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం తెరాస ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారు. ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించాం. దేశ పరివర్తన కోసమే భారాస ఏర్పాటు చేశాం. దిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరం. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం తీసుకొస్తాం. జాతీయస్థాయిలో కొత్త పర్యావరణ విధానం కావాలి. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఉండవు. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో తెలుగువాళ్లు ఉన్నారు. తెలుగువాళ్ల కోసం భారాస కృషి చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీ చేస్తుంది. కుమారస్వామి మళ్లీ కర్ణాటక సీఎం కావాలి’’అని కేసీఆర్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని