Revanth Reddy: సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు: రేవంత్‌రెడ్డి

తెలంగాణను ఏపీలో కలిపేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఏమాత్రం స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు.

Updated : 09 Dec 2022 16:33 IST

హైదరాబాద్‌: తెలంగాణను ఏపీలో కలిపేందుకు సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఏమాత్రం స్పందించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందని.. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహమిది అని మండిపడ్డారు. ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అవుతుందన్నారు. మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ తెరాసను భారాసగా మార్చారని.. ఈ రోజు నుంచి కేసీఆర్‌కు తెలంగాణ పేగు బంధం తెగిపోయిందని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని