logo

భోలక్‌పూర్‌లో రూపాయికే వైద్యం క్లినిక్‌ ప్రారంభం

రూపాయికే నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు జీజీ ఛారిటీ ఆసుపత్రి ముందుకు రావడం అభినందనీయమని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డా.మోటూరి కృష్ణప్రసాద్‌ అన్నారు.

Published : 10 Dec 2022 03:25 IST

ప్రారంభిస్తున్న నగేష్‌ముదిరాజ్‌,   డా.కృష్ణప్రసాద్‌,  గంగాధర్‌గుప్తా

ముషీరాబాద్‌: రూపాయికే నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు జీజీ ఛారిటీ ఆసుపత్రి ముందుకు రావడం అభినందనీయమని ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డా.మోటూరి కృష్ణప్రసాద్‌ అన్నారు. శుక్రవారం భోలక్‌పూర్‌ అంజుమన్‌ వీధిలో ఏర్పాటు చేసిన జీజీ ఛారిటీ క్లినిక్‌ మొదటి శాఖను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్‌ ముదిరాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.  జీజీ ఛారిటీ క్లినిక్‌ ఛైర్మన్‌  గంగాధర్‌గుప్తా మాట్లాడుతూ త్వరలో వంద బ్రాంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌసుద్దీన్‌, వాజీద్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని