మరిచిపోకుండా.. మందుల సంచి
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికెబుల్ డిసీసెస్) మందుల కిట్‌ను పంపిణీ చేస్తోంది.
న్యూస్‌టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, బొంరాస్‌పేట్
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికెబుల్ డిసీసెస్) మందుల కిట్‌ను పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇటీవల మంత్రి సబితారెడ్డి జిల్లాలో వీటి బాధితులకు ఇచ్చి ప్రారంభించారు. అసంక్రమిత వ్యాధులకు గురైన వారు సక్రమంగా మందులు వేసుకునే విధంగా సంచులను రూపొందించారు. జిల్లాలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 22842 కిట్లను సరఫరా చేశారు. చక్కెర, రక్తపోటు, ఇతర వ్యాధులకు గురైనవారు వైద్యుల సూచన మేరకు మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పితే సమస్య జఠిలమవుతుంది. ఆ సమస్యలను అధిగమించేందుకు దీనిని రూపొందించారు. ఆరోగ్య కేంద్రాలకు నిత్యం వందల సంఖ్యలో వివిధ రుగ్మతలతో వస్తుంటారు. ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి నెలకు సరిపడా మందులు అందజేస్తారు. సంచిలోని మూడు అరల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాల్సిన మందులు ఉంటాయి. తద్వారా మరిచిపోకుండా తీసుకునేందుకు ఉపకరిస్తుంది. ఆరోగ్య కేంద్రాల్లో నమోదైన జాబితా ప్రకారం ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తున్నారు.
వారానికి ఒక సారి:
ఆరోగ్య ఉపకేంద్రాల్లో ప్రతి మంగళవారం, గురువారం ఎన్‌సీడీ క్లినిక్ నిర్వహిస్తున్నారు. రక్తపోటు, చక్కెర స్థాయిలు తనిఖీ చేస్తూ అనుగుణంగా వైద్యం అందజేస్తున్నారు. నిత్యం వేసుకోవాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. గతంలో కూడా ఈ విధానంలో సరఫరా చేశారు.
ఇది నిరంతర ప్రక్రియ: డాక్టర్ పల్వన్‌కుమార్, జిల్లా వైద్యాధికారి
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కిట్లు పంపించాం. అవసరమున్న మేరకు దశల వారిగా పంపిణీ చేస్తుంటారు. ఇది నిరంతర ప్రక్రియ. నెలకు సరిపడే మందులు ఉంటాయి. నెల తర్వాత రోగిని పరీక్షించి, ఆ పరిస్థితి ప్రకారం మాత్రలు వినియోగించాలని సూచిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం