logo

అనధికారిక అగ్రిమెంట్లు.. రూ.కోట్లలో డీల్‌

పరిశ్రమల రసాయన వ్యర్థాల తరలింపు.. పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది.

Published : 10 Dec 2022 03:22 IST

రసాయన వ్యర్థాల  తరలింపులో మాఫియా

నాలాలో పారుతున్న రసాయనాలు

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమల రసాయన వ్యర్థాల తరలింపు.. పారబోత ప్రక్రియ మాఫియా తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థ కనుసన్నల్లో సాగుతోంది. జీడిమెట్ల, ఐడీఏ బొల్లారం, కాటేదాన్‌ పారిశ్రామిక వాడల్లో ఈ మాఫియాకు చెందిన ప్రతినిధులు.. పరిశ్రమల యజమానులతో రూ.కోట్లలో డీల్‌ కుదుర్చుకుంటున్నారు. మూడు పారిశ్రామిక వాడల్లోని కొన్ని పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు మాఫియా ముఠాలకు నెలకు రూ.5-10 కోట్ల వరకూ ఇస్తున్నట్లు సమాచారం. పరిశ్రమల శాఖ, పోలీస్‌, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లోని కొందరు అధికారులతో అనధికారిక ఒప్పందాలు చేసుకొని.. వారు తమ కంపెనీల వైపు చూడకుండా సంతృప్తి పరుస్తున్నారు. జీడిమెట్లలోని పారిశ్రామికవాడలో పీసీబీ సిబ్బందిపై దాడి వెనుక ఈ మాఫియా ఉన్నట్లు సమాచారం.

* జీడిమెట్ల, కాటేదాన్‌, ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల ప్రమాదకర రసాయన వ్యర్థాలు నేరుగా నాలాలు, చెరువులు, భూగర్భంలోకి వెళ్లడం వెనుక పరిశ్రమల ప్రతినిధులు.. అధికారులకు మధ్య ఒప్పందాలున్నాయి.

* డ్రమ్ము రసాయనాల వ్యర్థాలు శుద్ధి చేసేందుకు రూ.10 వేలు ఖర్చయితే.. శుద్ధి చేయకుండా నాలాలు, చెరువుల్లో కలిపేందుకు రూ.2 వేలు ఇస్తే సరిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని