logo

గీత కార్మికుల సంక్షేమానికి కృషి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 10 Dec 2022 03:22 IST

ఐక్యత ప్రదర్శిస్తున్న వీజీగౌడ్‌, కూనంనేని, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మణ్‌రావుగౌడ్‌, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు

బోడుప్పల్‌, న్యూస్‌టుడే: గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో ‘తెలంగాణ గీత పనివారల సంఘం’ మహాసభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా పాలొన్నారు. కూనంనేని ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మేడిపల్లి మండల సీపీఐ కార్యదర్శి రచ్చకిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు