ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం
నగరం నడిబొడ్డున ఉన్న కాచిగూడలో ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. దాన్ని గతంలోనే తాము స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాయించిన గేటును సైతం తొలగించి మరో బోర్డు ఏర్పాటుచేశారు.
కాచిగూడ పరిధిలో.. రూ.10 కోట్ల విలువైన భూమి కబ్జా
స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు రాసిన గేటు తొలగింపు
కాచిగూడ, న్యూస్‌టుడే: నగరం నడిబొడ్డున ఉన్న కాచిగూడలో ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. దాన్ని గతంలోనే తాము స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ రాయించిన గేటును సైతం తొలగించి మరో బోర్డు ఏర్పాటుచేశారు.అందులో కొన్ని నెలలక్రితమే భవన నిర్మాణాన్ని ప్రారంభించినా, రెవెన్యూ యంత్రాగం అడ్డుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
2021లో స్వాధీనం..
కాచిగూడ చప్పల్బజార్లోని పన్నాలాల్ బిల్డింగ్ ఎదురుగా నిజాంల కాలంలో నిర్మించిన పురాతనభవనం 2వేల చదరపు గజాల్లో ఉండేది. దీని వారసులు దేశ విభజన అనంతరం పాకిస్థాన్‌కు వలసపోయినట్లు సమాచారం. స్థానికులు కొందరు గుట్టుగా ఆ భవనాన్ని కూల్చివేసి చదును చేశారు. 2021 ఏప్రిల్‌లో అప్పటి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో హిమాయత్‌నగర్ తహసీల్దార్ స్వాధీనం చేసుకుని గేట్లు, ప్రహారీపై ప్రత్యేకంగా రాయించారు.
భవననిర్మాణం..
తరువాత సంబంధితులు కొంత ఆక్రమించుకుని ప్రహరీ నిర్మించారు. భవన నిర్మాణం ప్రారంభించారు. మండల రెవెన్యూ సిబ్బంది, ఆ స్థలంలో బోరింగ్‌ను సీజ్ చేసినా నిర్మాణ పనులను అడ్డుకోలేదు.
కోర్టులో పిటిషన్ వేశాం... -చంద్రకళ, తహసీల్దార్, హిమాయత్‌నగర్
భవన నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ సంబంధిత వ్యక్తులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. వాటిని రద్దు చేయించడానికి మరో పిటిషన్‌ను దాఖలు చేశాం.
జోనల్ అధికారుల నుంచి అనుమతి
-సాయిబాబా, ఏసీపీ, జీహెచ్ఎంసీ సర్కిల్-16
ప్రభుత్వ స్థలంలో భవన నిర్మాణానికి అంబర్‌పేట సర్కిల్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సికింద్రాబాద్ జడ్సీ కార్యాలయం నుంచి అక్రమార్కులు దీన్ని తెచ్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!