ఎమ్మెల్సీని అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గీయులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై శుక్రవారం తలకొండపల్లిలో దాడి జరిగింది.
కార్యకర్తల తోపులాటలో చిక్కుకున్న కసిరెడ్డి, వెంకటేశ్
తలకొండపల్లి, న్యూస్‌టుడే: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిపై శుక్రవారం తలకొండపల్లిలో దాడి జరిగింది. నూతన పంచాయతీ కార్యాలయ భవన ప్రారంభానికి జడ్పీటీసీ సభ్యుడు ఉప్పల వెంకటేశ్‌తో కలిసివస్తున్న ఎమ్మెల్సీ కారును జడ్పీటీసీ మాజీసభ్యుడు పి.నర్సింహ నేతృత్వంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ వర్గీయులు అడ్డుకున్నారు. భారాసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి సహకరిస్తున్నారంటూ, ఎమ్మెల్సీ డౌన్‌డౌన్ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్ వర్గం ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో నర్సింహ ఎమ్మెల్సీ నారాయణరెడ్డిని తోసేశారు. వెనుక నుంచి మరొకరు జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్‌ను చొక్కాపట్టి లాగడంతో రెండు వర్గాలమధ్య తోపులాట తీవ్రమైంది. ముగ్గురు కానిస్టేబుళ్లు అక్కడికివచ్చి వారించినా ఫలితం లేకపోయింది. అనంతరం వచ్చిన మరో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నను సైతం ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకొని నిరసన తెలిపారు. పంచాయతీ భవన నిర్మాణానికి నిధులిస్తే ఇంత రాజకీయం చేయడం ఏమిటని, ఎవరికీ భయపడేది లేదని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం