logo

ఏమార్చేందుకు ప్రయత్నించారు: అదనపు సీపీ సుధీర్‌బాబు

పక్కా పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసిన నవీన్‌రెడ్డి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఎత్తుగడ వేశాడు. బాధితురాలిని మరో వాహనంలోకి మార్చి తాను మరోవైపు పారిపోయాడు.

Published : 10 Dec 2022 03:22 IST

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మన్నెగూడలో శుక్రవారం యువతి కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పోలీసులు యువతి ఇంటి వద్ద నిందితుడు నవీన్‌రెడ్డికి చెందిన షెడ్డును కూల్చివేశారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ సాగర్‌ రోడ్డుపై  యువతి తండ్రి, బంధువులు ధర్నా చేశారు.

ఆదిభట్ల: పక్కా పథకం ప్రకారం కిడ్నాప్‌ చేసిన నవీన్‌రెడ్డి పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ఎత్తుగడ వేశాడు. బాధితురాలిని మరో వాహనంలోకి మార్చి తాను మరోవైపు పారిపోయాడు. ఫోన్లు స్విచ్ఛాప్‌ చేశారు. రెండు, మూడు బృందాలుగా మారి వేర్వేరు మార్గాల్లో పారిపోయినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆదిభట్ల పోలీసులు, రాచకొండ ఎస్‌వోటీ బృందాలు.. కిడ్నాప్‌ చేసిన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నిందితులు ప్రయాణించిన కార్లు హాలియా మీదుగా నల్గొండ, గుంటూరు, విజయవాడ వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. రాచకొండ పోలీసులిచ్చిన సమాచారంతో నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. నవీన్‌రెడ్డి సొంతూరు ముషంపల్లిలోనూ గాలించారు. చివరకు యాచారం సమీపంలో ఆమెను ఉంచినట్లు పోలీసులు గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు.వైద్యవిద్యార్థిని కిడ్నాప్‌ సమాచారం అందగానే అప్రమత్తమయ్యామని ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ స్పష్టంచేశారు. యువతి కిడ్నాప్‌, ఇంటి వద్ద గొడవ గురించి ఉదయం 11.54కు సమాచారం రాగానే 8 నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరినట్టు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు