logo

ఆఖరులో.. షికారు

కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏది కొనాలన్నా.. వచ్చే ఏడాది కొనొచ్చులే అని వాయిదా వేస్తుంటారు.. వాహన విక్రయాలైతే ఏడాది ఆఖర్లో పూర్తిగా మందగిస్తుంటాయి.

Published : 22 Dec 2022 04:43 IST

సంవత్స రాంతంలో భారీ తగ్గింపులు.. సందడిగా ఆటోమొబైల్‌ షోరూంలు

కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏది కొనాలన్నా.. వచ్చే ఏడాది కొనొచ్చులే అని వాయిదా వేస్తుంటారు.. వాహన విక్రయాలైతే ఏడాది ఆఖర్లో పూర్తిగా మందగిస్తుంటాయి. సంవత్సరం మారితే మోడల్‌ పాతదైపోతుందని.. కొత్త సంవత్సరంలో కొత్త మోడల్‌ కొనేందుకు వాహనదారులు మొగ్గు చూపేవారు. ఇది విక్రయాలపై తీవ్ర ప్రభావం చూపేది. కొవిడ్‌ అనంతరం రెండేళ్లుగా సంవత్సరాంతంలోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కార్ల షోరూంలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చీకటిపడగానే త్వరగా మూతపడే షోరూంలు కార్లను యజమానులకు అందజేసేందుకు రాత్రి వేళ అదనపు గంటలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చూస్తే అందుకు భిన్నంగా కన్పిస్తున్నాయి.

అత్తాపూర్‌లో కొనుగోలుదారులు, కార్ల డెలివరీతో రాత్రి సైతం సందడిగా ఉన్న మారుతీ షోరూం

ధరలు పెంపు ప్రకటనతో..

జనవరి ఒకటి నుంచి ఆటోమొబైల్‌ సంస్థలు వాహన ధరలు పెంచబోతున్నాయి. వ్యూహాత్మకంగా ధరల పెంపును నెలల ముందే ప్రకటించాయి. దాంతో రేట్లు పెరిగి పోతాయనే ఉద్దేశంతో డిసెంబరు 31లోపు కొనుగోలుకు పెద్ద ఎత్తున వాహనదారులు మొగ్గుచూపుతున్నారు.

ఒక్క రోజే ఐదు కార్ల డెలివరీ..

‘వ్యాగన్‌ ఆర్‌ కార్లపై భారీ తగ్గింపు ఉండటంతో.. సోమవారం ఒక్కరోజే ఐదు కార్లు డెలివరీ చేశాం’ అని మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్‌ శివ ‘ఈనాడు’తో అన్నారు. ‘మహేంద్ర ఆఫర్లు ఇస్తుండటంతో ఎక్స్‌యూవీ300 బుక్‌ చేశా.’ అని కొనుగోలుదారు సంజయ్‌గాంధీ అన్నారు.

నచ్చిన వాటికి కాదు..

మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న మోడళ్లపై ఆయా సంస్థలు రూపాయి కూడా తగ్గించడం లేదు. రెండు నెలల నుంచి ఆరునెలల వరకు వెయిటింగ్‌ ఉండటమే దీనికి కారణం. గేర్‌ రహిత మోడళ్లకు తగ్గింపు పెద్దగా ఉండటం లేదు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని