logo

Swiggy: ఇడ్లీ బాగుంది..బిర్యానీ అదిరింది: స్విగ్గీ నివేదికలో వెల్లడి

  మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గులతో టమాటా వార్తల్లో నిలుస్తుంటుంది.

Updated : 23 Dec 2022 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌:  మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గులతో టమాటా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి టమాటా వార్తల్లోకి ఎక్కింది. హైదరాబాద్‌లో ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నవాటిలో టమాటా ఒకటి కావడం విశేషం. 2022లో  హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ విశేషాలను స్విగ్గీ గురువారం విడుదల చేసింది.
* తింటే చికెన్‌ బిర్యానీ తినాలంటున్నారు హైదరాబాద్‌ ఆహార ప్రియులు. ఉదయం మాత్రం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే వంటకాల్లో వరసగా మూడో ఏడాది బిర్యానీకే నగరవాసులు ఎక్కువగా మొగ్గుచూపారు.
* అత్యధికంగా ఆర్డర్‌ చేసిన మొదటి మూడు వంటకాల్లో చికెన్‌ బిర్యానీ, అప్రికాట్‌ డిలైట్‌, మటన్‌ బిర్యానీ నిలిచాయి.
* స్నాక్‌ డిషెస్‌లో ఇడ్లీ, మస్కాబన్‌, మసాలా దోశను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
* అత్యధిక ఆర్డర్‌ చేసిన డెజర్ట్‌లలో అప్రికాట్‌ డిలైట్‌, డబుల్‌ కా మిఠా, ఫ్రూట్‌ సలాడ్‌ విత్‌ ఐస్‌క్రీమ్‌ ఉన్నాయి.
* ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్నవాటిలో శీతలపానీయాలు, పాల ఉత్పత్తులతో పాటు టమాటాలు ఉంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని