logo

Chalapathi Rao: ముగిసిన సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు

సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం విద్యుత్‌ దహన వాటిక వద్ద ఆయన కుమారుడు రవిబాబు, కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

Published : 28 Dec 2022 11:05 IST

హైదరాబాద్‌: సినీనటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం విద్యుత్‌ దహన వాటిక వద్ద ఆయన కుమారుడు రవిబాబు, కుటుంబసభ్యుల సమక్షంలో అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మంచు మనోజ్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, బండ్ల గణేశ్‌, బోయపాటి శ్రీను, శ్రీవాస్‌, బి.గోపాల్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌ తదితరులు అక్కడికి వెళ్లారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో శనివారం రాత్రి చలపతిరావు గుండెపోటుతో మృతిచెందారు. అమెరికాలో స్థిరపడిన కుమార్తెలు శ్రీదేవి, మాలిని హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం బుధవారం ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని