logo

Hyderabad: ట్రేడింగ్‌ ఖాతాలో రూ.కోటి లాక్‌ చేసిన కేటుగాళ్లు

తన డీమ్యాట్‌ ఖాతాలోని రూ.కోటి లాక్‌ చేశారంటూ ఓ విశ్రాంత ఉద్యోగి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Updated : 19 Jan 2023 09:49 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తన డీమ్యాట్‌ ఖాతాలోని రూ.కోటి లాక్‌ చేశారంటూ ఓ విశ్రాంత ఉద్యోగి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి(60) ట్రేడింగ్‌ ట్రేడ్‌ గ్లోబల్‌, ఎంఎస్‌ ట్రేడింగ్‌ ట్రేడ్‌, ఎంఎస్‌ ఏషియా రీసెర్చి, ఎంఎస్‌ విన్‌వే రీసెర్చి, వెల్త్‌ ఐటీ సెక్యూరిటీ, ఎంఎస్‌ ఐపీఓ ఎన్‌ఎస్‌ఈ పేరుతో ఉన్న కంపెనీల్లో ట్రేడింగ్‌ చేశారు. అందుకు సంబంధించి డీమ్యాట్‌ ఖాతాలో కోటి రూపాయలున్నాయి. ఇటీవల సైబర్‌ మోసగాళ్లు ఆ డీమ్యాట్‌ ఖాతాను లాక్‌ చేశారు. దీనిని గ్రహించిన బాధితుడు ముందు జాగ్రత్తగా మోసగాళ్లు చేస్తున్న ఫోన్లకు స్పందించకుండా వెంటనే సైబర్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొనిదర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని