logo

రక్త దానం.. మహా దానం: టీఆర్‌ఆర్‌

రక్తదానం మహాదానమని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తిర్మలాపూర్‌ మాజీ సర్పంచి పెంటయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం రాకంచర్లలో రక్తదాన శిబిరం జరిగింది.

Published : 20 Jan 2023 03:45 IST

రాకంచర్లలో గుర్తింపు పత్రం అందజేస్తున్న టీఆర్‌ఆర్‌

పూడూరు: రక్తదానం మహాదానమని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తిర్మలాపూర్‌ మాజీ సర్పంచి పెంటయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం రాకంచర్లలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా పెద్దఎత్తున రక్తం ఇచ్చేందుకు యువకులు ముందుకు వచ్చారు. టీఆర్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసరంలో పేదలకు ఉపయోగ పడుతుందని ముందుకు రావటంపై యువతను అభినందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్‌ కాంగ్రెస్‌ నాయకులు అల్తాఫ్‌, కండ్లపల్లి శ్రీనివాస్‌, సల్మాన్‌, మోయిన్‌, సాయన్న, భాస్కర్‌, గోపాల్‌ ఉన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని