Vijay Deverakonda: వాలీబాల్‌ను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నది మా లక్ష్యం: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: వాలీబాల్‌ను దేశంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లాలని, ఆ క్రీడను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున వాలీబాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’ (Hyderabad Black Hawks)కు ఆయన సహ యజమానిగా ఉండడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బ్లాక్ హాక్స్’ టీమ్ అద్భుతమైంది. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. మా టీమ్ ప్రతిభను భారతదేశానికే కాదు విదేశాలకు తెలియజేసేందుకు చేయాల్సినంత నేను చేస్తా’’ అని విజయ్ పేర్కొన్నారు. బ్లాక్ హాక్స్ యజమాని అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘విజయ్ మాతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా బ్రాండ్ మరోస్థాయికి వెళ్తుందనుకుంటున్నా’’ అని అన్నారు.
ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, కాలికట్. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబయి టీమ్‌లు పోటీపడనున్నాయి. ఇప్పటికే తొలి సీజన్ ముగియగా రెండో సీజన్ ఫిబ్రవరి 4 నుంచి మార్చి 5 వరకు జరగనుంది. తొలి సీజన్‌లో బ్లాక్ హాక్స్ టీమ్ సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సమంత క్షమాపణ
-
India News
Budget 2023: ఆ స్కూళ్లలో 38,800 ఉద్యోగాలు: కేంద్రం
-
Politics News
Andhra news: అందరికీ ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్ : మంత్రి బుగ్గన
-
Politics News
CM Jagan: నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టి
-
Movies News
Social Look: ‘ఫర్జీ’ కోసం రాశీఖన్నా వెయిటింగ్.. శివాత్మిక లవ్ సింబల్!
-
Sports News
Team India: భారత క్రికెట్ భవిష్యత్ సూపర్ స్టార్లు వారే: కుంబ్లే