logo

ఆరోగ్య పథకంపై మంత్రి హరీశ్‌రావుతో టీఎన్జీవో నేతల భేటీ

ఆరోగ్య పథకంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో టీఎన్జీవో నేతలు సమావేశమయ్యారు. భేటీ అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు.

Published : 23 Jan 2023 15:54 IST

హైదరాబాద్: ఆరోగ్య పథకంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో టీఎన్జీవో నేతలు సమావేశమయ్యారు. భేటీ అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగుల సంక్షేమం కోసం మంత్రి హరీశ్‌రావు చర్యలు తీసుకుంటామన్నారు. 1 శాతం ఉద్యోగుల చందాతో హెల్త్‌ స్కీం అమలు చేయాలని కోరాం. సీజీహెచ్‌ఎస్‌ కంటే మెరుగ్గా ఉండాలని కోరాం. ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీఏ, జీతాల ఆలస్యం తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో చర్చించాం. సీఎంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల భేటీ ఏర్పాటు చేయాలని కోరాం. ఒప్పంద ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా మంచి హెల్త్‌ స్కీం ఉండాలి. 317 జీవో, స్పౌస్‌ బదిలీలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు’’ అని రాజేందర్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని