1 ఫోన్.. 2 యాప్‌లు
మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. జలమండలి రూపొందించిన 2 యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే తాగునీటి మీటర్ రీడింగ్, బిల్లుల చెల్లింపు అన్నీ అరచేతిలోనే అయిపోతాయి.
నీటి మీటర్ రీడింగ్.. బిల్లుల చెల్లింపులకు కొత్త విధానం
ఈనాడు, హైదరాబాద్
స్వీయ బిల్లింగ్
మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. జలమండలి రూపొందించిన 2 యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటే తాగునీటి మీటర్ రీడింగ్, బిల్లుల చెల్లింపు అన్నీ అరచేతిలోనే అయిపోతాయి. మీటర్ రీడింగ్ కోసం అధికారులు మనింటికి రావాల్సిన అవసరం లేదు. మీరే నెలనెలా రీడింగ్ ఫొటో తీసి పంపొచ్చు. బిల్లు కట్టేందుకు మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరమూ లేదు. స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించొచ్చు. ఇందుకు జలమమండలి రూపొందించిన ‘భారత్ స్మార్ట్’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీటర్ రీడింగ్‌ను ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. సాంకేతిక విభాగం అధికారులు ఆ ఫొటో చూసి గతనెల నమోదైన రీడింగ్‌ను మినహాయించి తాజా బిల్లు పంపిస్తారు. ఇక ‘హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ’ యాప్ ద్వారా ఆ బిల్లు చెల్లించేందుకు పేటీఎం సహా మరో 4 పేమెంట్ గేట్వేలను జలమండలి అందుబాటులో ఉంచిది. ఈ విధానాన్ని 4 నెలల నుంచి కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కొద్దినెలల్లోనే 6 లక్షల మంది వినియోగదారులకే చేరేలా కార్యాచరణ రూపొందించారు. ఆన్లైన్లో బిల్లులు చెల్లించేవారి సంఖ్యను 90 శాతానికి పెంచాలని నిర్ణయించారు.
కృత్రిమ మేధతో రూపకల్పన
ఈ యాప్‌లను కృత్రిమ మేధతో రూపొందించారు. వినియోగదారులు మీటర్ రీడింగ్‌ను ఫొటో తీసి ఫొటోషాప్‌లో తక్కువగా మార్చి పంపించినా.. యాప్ పనిచేస్తుందా.. అని పరీక్షించేందుకు ఎక్కువ యూనిట్లు వినియోగించినట్టు ఫొటో పంపినా యాప్‌లో ఉన్న కృత్రిమ మేధ వాటిని తిరస్కరిస్తుంది. సాఫ్ట్‌వేర్‌లో ప్రతి వినియోగదారుడి వివరాలు, సగటు మీటర్ రీడింగ్, బిల్లులు ఎప్పుడు, ఎలా చెల్లిస్తున్నారన్న వివరాలన్నీ ఉంటాయి. మీరు ఏమాత్రం తప్పు చేసినా కృత్రిమేధ వాటిని విశ్లేషిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్లో రిస్క్‌లో పడుతుందని ఆయన చెప్పాడు: హనుమ విహరి
-
Movies News
Social Look: హల్దీ వేడుకలో పూజాహెగ్డే.. సమంత ‘లైట్’ పోస్ట్!
-
India News
Loan Apps: 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా!
-
Politics News
KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
-
Movies News
Thaman: నెగెటివిటీపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. రమీజ్ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్ మాటల్లో..!