logo

పాదచారి సురక్షితంగా రోడ్డు దాటేలా..

నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో ప్రమాదాల బారినా పడుతున్నారు.

Published : 25 Jan 2023 01:46 IST

నగరంలో 25 ప్రాంతాల్లో ప్రత్యేక ఐలాండ్స్‌ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పాదచారులు రోడ్డు దాటేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో ప్రమాదాల బారినా పడుతున్నారు. వారి అవస్థలు తీర్చేందుకు, ప్రమాదాల కట్టడిలో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులు ఓ అడుగు ముందుకేశారు. రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 25 ప్రాంతాల్లో పాదచారుల ఐలాండ్స్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆధునిక పద్ధతిలో నిర్మించే ఐలాండ్స్‌ను ముందుగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగంతో కలసి కొన్ని ప్రదేశాలను గుర్తించినట్టు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఐలాండ్స్‌ నిర్మాణం చేపట్టే నారాయణగూడ, ఎస్‌ఎంటీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు, నాగార్జున సర్కిల్‌, ఐడీపీఎల్‌ తదితర కూడళ్లను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసు అధికారులు పరిశీలించారు. అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, అధిగమించే మార్గాలను చర్చించారు. ఐలాండ్స్‌ పూర్తిగా అందుబాటులోకి వస్తే పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మరింత వెసులుబాటు ఉంటుందని అదనపు సీపీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని