logo

సీఏల కృషితోనే జీఎస్టీ విజయవంతం

మునుపెన్నడూ లేనంత వేగంతో భారత్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని, 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ అన్నారు. 

Published : 25 Jan 2023 01:46 IST

కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌

విద్యార్థినికి పట్టా అందజేస్తున్న అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌

మాదాపూర్‌: మునుపెన్నడూ లేనంత వేగంతో భారత్‌ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని, 21వ శతాబ్దం భారత్‌దే అవుతుందని కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ అన్నారు.  భారత్‌ 2030 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు.  మంగళవారం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) 2023 స్నాతకోత్సవం మాదాపూర్‌ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మేఘవాల్‌.. సీఏ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం  మాట్లాడుతూ..‘‘ దేశంలో జీఎస్‌టీ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలకు దానిపై అవగాహన కల్పించడమే కాకుండా వారి అపోహలను, సందేహాలను నివృత్తి చేయడంలో సీఏలు చేసిన కృషి అభినందనీయం. జీ-20 దేశ సమావేశాల్లో ఐసీఏఐ కూడా భాగస్వామ్యం కావాలి’’ అని ఆయన ఆకాంక్షించారు. ఐసీఏఐ అధ్యక్షులు దేబాషిస్‌ మిత్రా,  మాట్లాడుతూ..సీఏ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన 14500 మంది విద్యార్థుల్లో 42 శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు