logo

నెక్నాంపూర్‌ చెరువు రంగు మారుతోంది

అరుదైన జలచరాలకు, పక్షులకు ఆవాసంగా ఉన్న నెక్నాంపూర్‌ చెరువు రంగు మారుతోంది. చెరువు చుట్టుపక్కల ఉండే గృహ సముదాయాల నుంచి వెలువడే మురుగు చెరువులోకి చేరుతుండటంతో మళ్లీ మురుగు కుంటగా మారుతోంది.

Published : 25 Jan 2023 01:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: అరుదైన జలచరాలకు, పక్షులకు ఆవాసంగా ఉన్న నెక్నాంపూర్‌ చెరువు రంగు మారుతోంది. చెరువు చుట్టుపక్కల ఉండే గృహ సముదాయాల నుంచి వెలువడే మురుగు చెరువులోకి చేరుతుండటంతో మళ్లీ మురుగు కుంటగా మారుతోంది.‘ధ్రువాంశ్‌ ఎన్జీవో’ కృషి నిష్ఫ్రయోజనమే అవుతోంది. చుట్టుపక్కల నిర్మాణాలు వెలుస్తుండటం.. అక్కడి నుంచి వెలువడే మురుగును ఈ చెరువులోకి వదులుతుండటంతో తిరిగి పాతస్థితికి చేరుతోంది. సుమారు 180 ఎకరాల్లో ఉండే చెరువు..ఎన్జీవో పునరుద్ధరించే బాధ్యతను తీసుకునేనాటికి 25 ఎకరాలకు కుచించుకుపోయింది. 2018లో చెరువు పునరుద్ధరణను ప్రారంభించింది. నీటిపై కదులుతూ శుద్ధి చేసే ‘ఫ్లోటింగ్‌ ట్రీట్‌మెంట్‌ వెట్‌ల్యాండ్‌’తో నీటి శుద్ధి నిర్వహణ చేస్తోంది. ఈ పద్ధతిలో 3,000 చదరపు అడుగుల రాఫ్ట్‌ను ఏర్పాటుచేసి దానిపై 3,500 మొక్కలు నాటారు. ఇది నీటిలో కదులుతుంటే మొక్కల అడుగు భాగాలు నీటిని శుద్ధి చేస్తుంటాయి. ఈ పద్ధతిలో చెరువును శుద్ధి చేయడాన్ని నీతి ఆయోగ్‌ సైతం ప్రశంసించింది. క్రమక్రమంగా మళ్లీ మురుగు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు