యువతులు సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి
యువతులు ఏ రంగంలో కేరీర్ ఎంచుకున్నా ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
సోమాజిగూడ, న్యూస్‌టుడే: యువతులు ఏ రంగంలో కేరీర్ ఎంచుకున్నా ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మంగళవారం బేగంపేట కుందన్‌బాగ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో జరిగిన ‘మీడియా స్పియర్-2023’ సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాస్ కమ్యూనికేషన్స్ రంగంలో యువతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం శుభపరిణామమన్నారు. ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రుల ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కూతురినైనా.. ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా తానూ అనేక సవాళ్లకు ఎదురీదాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కుమారులతో సమానంగా కూతుళ్లనూ చదివించాలనే తన తల్లి ఆలోచనతో ఆంగ్లం మాధ్యమంలో చదివానని, ప్రపంచాన్ని తెలుసుకునే విషయంలో ఆందోళన చెందిన తల్లిని ఒప్పించి.. తండ్రే విదేశాలకు పంపారన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు భారత్ జాగృతి ఈ ఏడాది నుంచి పది మంది అత్యుత్తమ ప్రతిభ చాటే పేద విద్యార్థులకు ‘కేసీఆర్ స్కాలర్‌షిప్పు’లు ఇస్తుందన్నారు. మీడియా స్పియర్ విజేతలుగా నిలిచినవారిని భారత్ జాగృతి కోసం మూడు సినిమాలు ‘తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ, కెమెరా కళ్లతో ఇండియా(ఇండియా త్రూ యువర్ లెన్స్), మనం ఓటు ఎందుకు వేయాలి’ అనే అంశాలపై నిర్మించాలని కోరారు. నటుడు, దర్శకుడు చంద్ర వెంపటి, కళాశాల ప్రిన్సిపల్ శాండ్రాహోర్టా, వైస్ ప్రిన్సిపల్ షెర్లీ, మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ అనిత పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా