logo

పోటీపరీక్షల అభ్యర్థులకు తీపి కబురు

పోటీ పరీక్షల నోటిఫికేషన్ల జారీతో నగరంలోని గ్రంథాయాల్లో అభ్యర్థుల రద్దీ పెరిగింది. చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతోపాటు శాఖా గ్రంథాలయాల్లో పోటెత్తుతున్నారు.

Published : 26 Jan 2023 04:23 IST

20 శాఖా గ్రంథాలయాల్లో పనివేళల పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: పోటీ పరీక్షల నోటిఫికేషన్ల జారీతో నగరంలోని గ్రంథాయాల్లో అభ్యర్థుల రద్దీ పెరిగింది. చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతోపాటు శాఖా గ్రంథాలయాల్లో పోటెత్తుతున్నారు. ఈ మేరకు రద్దీ ఎక్కువగా ఉన్న 20 శాఖ గ్రంథాలయాలను ఎంపిక చేసి వాటి పనివేళలను పెంచారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే తెరిచి ఉండటంతో పూర్తిస్థాయిలో చదవలేకపోతున్నామంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేయడంతో నగర కేంద్ర గ్రంథాలయ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నిరంతరాయంగా తెరిచి ఉండేలా వెసులుబాటు కల్పించింది. నగర కేంద్ర గ్రంథాలయానికి రోజూ 2,500 మంది అభ్యర్థులు వస్తున్న నేపథ్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు పెంచారు. నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు 20 శాఖా గ్రంథాలయాల్లో మొత్తం 3,900 మంది పోటీపరీక్షల అభ్యర్థులు రోజూ సన్నద్ధమవుతున్నారు. వీటిలో పోటీపరీక్షల నేపథ్యంలో పుస్తకాలకు డిమాండ్‌ పెరిగింది. 2021-22లో 890 పుస్తకాలు కొనుగోలు చేస్తే, 2022-23లో 3200 పుస్తకాలు ఆన్‌డిమాండ్‌లో రిజిస్టర్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని