logo

దక్కన్‌ మాల్‌ కూల్చివేతకు సర్వం సిద్ధం

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో జనవరి 19న అగ్నిప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది.

Published : 26 Jan 2023 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులో జనవరి 19న అగ్నిప్రమాదానికి గురైన దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేతకు రంగం సిద్ధమైంది. అందుకు గుత్తేదారును జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసింది. రూ.33.86 లక్షల అంచనాతో టెండరు పిలవగా నగరానికి చెందిన ఎస్‌.కె.మల్లు కన్‌స్ట్రక్షన్స్‌ రూ.25.94 లక్షలకు దక్కించుకుంది. వెంటనే పనులు ప్రారంభించాల్సి ఉండగా పోలీసులు, మండల రెవెన్యూ అధికారి నుంచి అనుమతి రాలేదు. తమవారి ఆచూకీ తెలిసే వరకు భవనాన్ని కూల్చొద్దని ఆచూకీ గల్లంతైన ముగ్గురి కుటుంబసభ్యులు అడ్డుకోవడమే కారణం. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారం తీసుకునేందుకు సహకరించాలని పోలీసులు వారిని కోరారు. వారు అంగీకరిస్తే గురువారం కూల్చివేత మొదలుకానుందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని