logo

సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులు షురూ

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.699 కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Published : 26 Jan 2023 04:23 IST

ఆర్పీఎఫ్‌ కార్యాలయం వద్ద..

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.699 కోట్లతో స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే భూసార పరీక్షకు సంబంధించిన పనులు, స్థలాకృతి సర్వే పూర్తి చేశారు. ఈ సర్వే ఆధారంగా సైట్‌ లేఅవుట్‌, సరిహద్దు నమూనా పనులు సాగుతున్నాయి. తాత్కాలిక బుకింగ్‌ కార్యాలయంతోపాటు.. ఆర్‌పీఎఫ్‌ కార్యాలయ నిర్మాణం కోసం స్టేషన్‌కు చేరువలో పునాదులు వేస్తున్నారు. స్టేషన్‌ పునరాభివృద్ధి తర్వాత అధునాతనమైన హంగులతో టికెట్‌ బుకింగ్‌ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతం స్టేషన్‌కు ఉత్తరం వైపు వచ్చే మల్టీ-లెవెల్‌ కార్‌ పార్కింగ్‌కు అనుగుణంగా ప్రస్తుత బుకింగ్‌ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాల్సి వచ్చింది. ఉత్తరం వైపున్న ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ గేట్‌ నం.3 సమీపంలో ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చామని ద.మ.రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని