logo

నైజీరియా డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్టు

కొకైన్‌ విక్రయించడానికి ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నైజీరియాకు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 Jan 2023 04:23 IST

 

ఇమాన్యుయెల్‌ ఒసాండు

చార్మినార్‌: కొకైన్‌ విక్రయించడానికి ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నైజీరియాకు చెందిన డ్రగ్‌ పెడ్లర్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రూ.60 వేల విలువ చేసే 5 గ్రాముల కొకైన్‌తోపాటు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం డీసీపీ గుమ్మీ చక్రవర్తి కథనం ప్రకారం..నైజీరియాకు చెందిన ఒజెన్‌గ్వా ఇమాన్యుయెల్‌ ఒసాండు(34) 2016లో విద్యార్థి వీసాపై ఇండియాకు వచ్చి, ముంబయిలో ఉంటున్నాడు. కొకైన్‌ను సరఫరా చేస్తూ డ్రగ్‌ పెడ్లర్‌గా అవతారమెత్తాడు. 2020లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. మంగళవారం డ్రగ్‌ సరఫరా చేయడానికి నిందితుడు జూపార్కు సమీపంలో తచ్చాడుతున్నాడు. నార్కోటిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం అధికారులు, బహదూర్‌పుర పోలీసులు ఒసాండును అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని