logo

గొలుసు దొంగ యూపీలో పట్టివేత

వరుస గొలుసు చోరీలతో హల్‌చల్‌ చేసిన అంతరాష్ట్ర ముఠాలో ఒకరిని యూపీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

Published : 26 Jan 2023 04:23 IST

మంగల్‌సింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వరుస గొలుసు చోరీలతో హల్‌చల్‌ చేసిన అంతరాష్ట్ర ముఠాలో ఒకరిని యూపీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఈనెల 7న ఉదయం 6.20 నుంచి 8.40 గంటల వరకూ 7 ప్రాంతాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు తెంపుకొని పారిపోయారు. సీసీ ఫుటేజి ఆధారంగా నిందితులు యూపీలోని షామ్లీ జిల్లాకు చెందిన మంగళ్‌సింగ్‌, పంకజ్‌ అలియాస్‌ పింకు, దీపక్‌, సెవాగేగా గుర్తించారు. షామ్లీ, బెంగళూరుల్లో వరుస స్నాచింగ్‌లకు పాల్పడిన నలుగురు 6న అర్ధరాత్రి నగరం చేరారు. వీరిలో ఇద్దరు చోరీలు చేశారు. కొట్టేసిన ద్విచక్రవాహనాన్ని సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద వదిలేసి ఆటోలో నగరంలో తిరిగారు. పోలీసుల తనిఖీ ఉండటంతో క్యాబ్‌లో వరంగల్‌ వైపు వెళ్లారు. ఆ తరువాత రైలెక్కి సొంతూరు చేరారు.  ప్రధాన నిందితుడు మంగల్‌సింగ్‌ అలియాస్‌ మంగల్‌ (29) ఆచూకీ తెలియడంతో అతన్ని షామ్లీ జిల్లా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతన్ని హైదరాబాద్‌ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు