logo

ఉన్నత చదువులకు కుమారుడిని సాగనంపి వస్తూ.. తిరిగిరాని లోకాలకు

కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న కుమారుణ్ని విమానాశ్రయం వద్ద సాగనంపి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం ఆయన్ను కబళించింది.

Published : 26 Jan 2023 04:23 IST

అమెరికా వెళ్లకుండానే వెనుదిరిగిన తనయుడు

పిట్ల నరేష్‌

దుండిగల్‌, శివ్వంపేట, న్యూస్‌టుడే: కుమారుడి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న కుమారుణ్ని విమానాశ్రయం వద్ద సాగనంపి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం ఆయన్ను కబళించింది. దుండిగల్‌ సీఐ రమణారెడ్డి వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన పిట్ల నరేష్‌(52), మాణికేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు నిరంజన్‌  అమెరికాలో ఎంఎస్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం తెల్లవారుజామున స్వగ్రామం నుంచి కుమారుడితో కలిసి తల్లిదండ్రులు కారులో శంషాబాద్‌ విమానాశ్రయానికి బంధువులతో కలిసి వెళ్లి కుమారుడికి వీడ్కోలు పలికి తిరిగి అదే వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో దుండిగల్‌ ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న ట్రక్‌ను వెనుక నుంచి వీరి కారు ఢీకొట్టింది. నరేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడి స్నేహితులు నిఖిల్‌, వంశీ గాయపడ్డారు. నరేష్‌ బంధువు పిట్ల వినయ్‌ కారు నడుపుతున్నాడు. నరేష్‌ చిన్న కుమారుడు రోహిత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

తండ్రి మరణవార్త విని వెనక్కు.. స్నేహితుల ద్వారా తండ్రి మరణవార్తను తెలుసుకున్న నిరంజన్‌ విమానాశ్రయం నుంచి ఘటనాస్థలానికి వెళ్లి బోరున విలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని