logo

లారీ ఢీకొని ట్రాఫిక్‌ హోంగార్డు దుర్మరణం

విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపడుతున్న ట్రాఫిక్‌ హోంగార్డును లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు.

Published : 26 Jan 2023 04:23 IST

శ్రీనివాస్‌

మేడ్చల్‌: విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపడుతున్న ట్రాఫిక్‌ హోంగార్డును లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం..వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం చాపలగూడెంకు చెందిన జి.శ్రీనివాస్‌(33) మేడ్చల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్‌ హోంగార్డుగా పనిచేస్తున్నారు.  జాతీయ రహదారి 44పై కండ్లకోయ వద్ద బుధవారం మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా.. ఓఆర్‌ఆర్‌ వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. శ్రీనివాస్‌ శరీరం పైనుంచి వెనుక చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందాడు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్‌లో అద్దెకుంటున్న శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు(6), కూతురు(4) ఉన్నారు. పుట్టుకతోనే కుమార్తెకు అనారోగ్యం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని