logo

అమలులో జాప్యాన్ని నివారించాలి

నూతన జాతీయ విద్యా విధానం అమల్లో జాప్యాన్ని నివారించాలని నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అలయెన్స్‌(ఎన్‌ఐఎస్‌ఏ) జాతీయ సలహాదారు, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధుల మధుసూదన్‌ కేంద్రాన్ని కోరారు.

Published : 26 Jan 2023 04:23 IST

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: నూతన జాతీయ విద్యా విధానం అమల్లో జాప్యాన్ని నివారించాలని నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అలయెన్స్‌(ఎన్‌ఐఎస్‌ఏ) జాతీయ సలహాదారు, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధుల మధుసూదన్‌ కేంద్రాన్ని కోరారు. బుధవారం అంబర్‌పేట బాపూనగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో సెంట్రల్‌ స్వైర్‌ ఫౌండేషన్‌(సీఎస్‌ఎఫ్‌) ఇటీవల దిల్లీలో నిర్వహించిన విద్యా సదస్సులో చర్చించిన అంశాలను వివరించారు. ఆయుష్‌ ప్రసాద్‌(ఐఏఎస్‌), డా.జోసెఫ్‌ ఇమ్మాన్యుయెల్‌(సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(అకడమిక్‌ డైరెక్టర్‌), డా.పార్థ్‌ షా(సెంటర్‌ ఫర్‌ సివిల్‌ సొసైటీ వ్యవస్థాపకుడు) తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని