logo

వెల్లివిరిసిన కళా ప్రతిభ

విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ట్రస్టీ రావి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Published : 26 Jan 2023 04:23 IST

రమాదేవి పబ్లిక్‌  స్కూల్‌లో ఆర్ట్‌అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌

వస్త్రంపై రూపుదిద్దిన చిత్రాన్ని పరిశీలిస్తున్న  రావి చంద్రశేఖర్‌, ఖమర్‌ సుల్తానా

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ట్రస్టీ రావి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలోని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానాతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సృజనాత్మకతతో ఆవిష్కరించిన పలు చిత్రాలు అబ్బురపర్చాయి. వస్త్రాలపై బ్లాక్‌ ప్రింటింగ్‌,   టై అండ్‌ డై, ఎంబ్రాయిడరీ, నిట్టింగ్‌, కలంకారి, మధుబని, అబ్‌స్ట్రాక్ట్‌, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌ తదితర ఆవిష్కరణలు ఔరా అనిపించాయి. పాఠశాల విద్యా సమన్వయకర్తలు మేరీ సునీల, కె.విజయలక్ష్మి, ఆర్ట్‌ ఉపాధ్యాయిని అర్చనా బిశ్వాస్‌, సోషల్‌ హెచ్‌ఓడీ శశిరేఖ పాల్గొన్నారు.

ఆరో తరగతి విద్యార్థిని కొబ్బరి ఆకులతో రూపొందించిన బొమ్మలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని