logo

నలుదిక్కులా బలోపేతం

విశ్వనగరంగా అడుగులు వేస్తున్న రాజధానిలో పోలీసింగ్‌ మరింత బలోపేతం కానుంది. మూడు కమిషనరేట్లలో కొత్తగా శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, ఎస్‌వోటీ జోన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా వాటికి బాధ్యుల్ని నియమించింది.

Published : 27 Jan 2023 03:49 IST

నగరానికి కొత్తగా 20మంది డీసీపీలు

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వనగరంగా అడుగులు వేస్తున్న రాజధానిలో పోలీసింగ్‌ మరింత బలోపేతం కానుంది. మూడు కమిషనరేట్లలో కొత్తగా శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, ఎస్‌వోటీ జోన్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. తాజాగా వాటికి బాధ్యుల్ని నియమించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా మూడు కమిషనరేట్లలో కొత్తగా 20 మంది డీసీపీలు వచ్చారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన జోన్లకు వీరంతా నేతృత్వం వహిస్తారు. మరో 16 మంది డీసీపీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. కరీంనగర్‌ సీపీ వి.సత్యనారాయణ రాచకొండ సంయుక్త కమిషనర్‌గా బదిలీ అయ్యారు. గతంలో రాచకొండ సంయుక్త కమిషనర్‌గా బదిలీ అయిన గజరావు భూపాల్‌.. తిరిగి హైదరాబాద్‌ సీసీఎస్‌ జేసీ బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు.

కొత్త జోన్లతో సమర్థ పోలీసింగ్‌

కొత్త నియామకాల్లో భాగంగా ఎస్‌వోటీ, యాంటీ నార్కోటిక్‌ బ్యూరోలు ఏర్పాటయ్యాయి. డ్రగ్స్‌, బెట్టింగ్‌ తదితర వ్యవస్థీకృత నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ఈ బృందాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాజా బదిలీల్లో భాగంగా రాచకొండ(మల్కాజిగిరి, ఎల్బీనగర్‌), సైబరాబాద్‌(డీసీపీ, డీసీపీ-2)కు కలిపి నాలుగు కొత్త ఎస్‌వోటీ జోన్లకు డీసీపీలను నియమించారు. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ పేరుతో కొత్తగా శాంతిభద్రతల డీసీపీలు రానున్నారు.  


నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జోన్లలో 20 మంది డీసీపీలు,  ఇతర విభాగాలు, జోన్లలో మరో 16 మంది డీసీపీలు బాధ్యతలు తీసుకోనున్నారు. వివరాలివీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు