logo

జిల్లెళ్లమూడి అమ్మ తపాలా కవరు ఆవిష్కరణ

సమాజ సేవ ఈశ్వర సేవ, ఆ సేవతో వచ్చే తృప్తే ఆనందం, అదే ఐశ్వర్యం, అదే ముక్తి అని జిల్లెళ్లమూడి అమ్మ చేసిన బోధ ఎంతో స్ఫూర్తిమంతమైందని వక్తలు అన్నారు.

Published : 27 Jan 2023 03:49 IST

కవరును ఆవిష్కరించిన విద్యాసాగర్‌రెడ్డి, రమణాచారి, గరికిపాటి నరసింహారావు తదితరులు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: సమాజ సేవ ఈశ్వర సేవ, ఆ సేవతో వచ్చే తృప్తే ఆనందం, అదే ఐశ్వర్యం, అదే ముక్తి అని జిల్లెళ్లమూడి అమ్మ చేసిన బోధ ఎంతో స్ఫూర్తిమంతమైందని వక్తలు అన్నారు. గురువారం రాత్రి రవీంద్రభారతిలో శ్రీవిశ్వ జననీ పరిషత్‌ ట్రస్టు (జిల్లెళ్లమూడి) ఆధ్వర్యంలో అమ్మ శతజయంతి సందేశ సభ ఘనంగా నిర్వహించారు. ట్రస్టు ఛైర్మన్‌ కుమ్మమూరు నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి మాట్లాడారు. అమ్మ స్మారక తపాలా కవర్‌ను పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి విడుదల చేశారు. మహాసహస్రవధాని డా.గరికిపాటి నరసింహారావు, హరెడిటరీ ట్రస్టీ బ్రహ్మాండం రవీంద్రరావు,  సంపాదకులు ఆచార్య మల్లా ప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, ఎం.వి.ఆర్‌.శర్మ,  డి.వి.ఎస్‌.కామరాజు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని