logo

సందడిగా విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్‌ వార్షికోత్సవం

విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్‌ మదీనగూడ, పటాన్‌చెరు శాఖల వార్షికోత్సవం గురువారం సందడిగా సాగింది. కొండాపూర్‌లోని విజ్ఞాన్‌ వరల్డ్‌ వన్‌స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలను ప్రముఖ సినీ దర్శకులు నాగ్‌అశ్విన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

Published : 27 Jan 2023 03:49 IST

హాజరైన  నాగ్‌అశ్విన్‌రెడ్డి, డా.లావు రత్తయ్య

మియాపూర్‌, న్యూస్‌టుడే: విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్‌ మదీనగూడ, పటాన్‌చెరు శాఖల వార్షికోత్సవం గురువారం సందడిగా సాగింది. కొండాపూర్‌లోని విజ్ఞాన్‌ వరల్డ్‌ వన్‌స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలను ప్రముఖ సినీ దర్శకులు నాగ్‌అశ్విన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తన మొదటి సినిమా షూటింగ్‌ మదీనాగూడలోని విజ్ఞాన్‌ పాఠశాలలో జరిగిందని గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల  సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డా.లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ఛైర్‌పర్సన్‌ రాణి రుద్రమదేవి, ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డా.సందీప్‌ క్రాంతికిరణ్‌, ప్రిన్సిపల్‌ మంజుల పాల్గొన్నారు. మరో మూడు రోజులపాటు వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతాయని పాఠశాల ప్రతినిధులు తెలిపారు.

విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని