logo

ఖైదీల పిల్లలకు విద్యారుణాలు

ఖైదీల పిల్లలకు తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో విద్యా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఐజీ యర్రంశెట్టి రాజేశ్‌ తెలిపారు.

Published : 27 Jan 2023 03:49 IST

తెలంగాణ జైళ్లశాఖ ఐజీ రాజేశ్‌

మాట్లాడుతున్నఐజీ రాజేశ్‌

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఖైదీల పిల్లలకు తెలంగాణ జైళ్లశాఖ ఆధ్వర్యంలో విద్యా రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఐజీ యర్రంశెట్టి రాజేశ్‌ తెలిపారు. చంచల్‌గూడలోని జైళ్లశాఖ శిక్షణా కేంద్రం పరేడ్‌ మైదానంలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జెండావిష్కరించి మాట్లాడారు. తెలిసో తెలియకో తప్పు చేసి ఎంతోమంది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారని, వారి పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా విద్యా రుణాలను అందజేసేందుకు తమ శాఖ ముందుకు వచ్చినట్లు తెలిపారు. చదువులో ప్రతిభ చూపే  ఖైదీల పిల్లల విద్యాభ్యాసం ఆగకుండా ప్రయత్నిస్తామన్నారు. జైళ్లశాఖ సంస్కరణల్లో రాష్ట్రవ్యాప్తంగా 1500మంది ఖైదీలకు తమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిశ్రమలు, పెట్రోలు బంకుల్లో ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు. గతేడాది తెలంగాణ జైళ్లశాఖ అధికారులకు ప్రకటించిన రాష్ట్రపతి పతకాలను ఈ సందర్భంగా ఆయన పరేడ్‌ కార్యక్రమంలో అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌, వరంగల్‌ జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు, డా.శ్రీనివాస్‌, చంచల్‌గూడ జైలు పర్యవేక్షణాధికారి నవాబు శివకుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని