logo

స్ఫూర్తిమంతం.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం

సెయింట్‌ పాల్స్‌ పూర్వ(1993) విద్యార్థుల సమ్మేళనాన్ని గురువారం రాత్రి హైదర్‌గూడలోని పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

Published : 27 Jan 2023 03:49 IST

నాటి మిత్రుల ఆప్యాయ పలకరింపులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సెయింట్‌ పాల్స్‌ పూర్వ(1993) విద్యార్థుల సమ్మేళనాన్ని గురువారం రాత్రి హైదర్‌గూడలోని పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న నాటి మిత్రులంతా ఒక్కచోట చేరి సందడిగా గడిపారు. పాఠశాల ప్రిన్సిపల్‌, పూర్వ విద్యార్థుల సంఘం ఛైర్మన్‌ సుధాకర్‌రెడ్డి సంఘం లోగో ఆవిష్కరించారు. చదువు, సామాజిక కార్యక్రమాల్లో ముందుంటున్న పదో తరగతి విద్యార్థులు మానస, ఇమ్మానియల్‌కు రూ.10వేల చొప్పున నగదుఅందజేశారు. పదో తరగతిలో ఉత్తమ విద్యార్థినులను బంగారు పతకాలతో సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంఘం అధ్యక్షుడు సయ్యద్‌మజర్‌ అలి అహ్మద్‌, ప్రతినిధులు శివప్రసాద్‌, ఉదయ్‌కుమార్‌ నాయుడు, రామకృష్ణ, జమాల్‌ ఇతరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు