కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి: జస్టిస్ జి.చంద్రయ్య
కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య కోరారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్ చంద్రయ్య, చిత్రంలో కె.గోవర్ధన్, దిడ్డి సుధాకర్ తదితరులు
కవాడిగూడ, న్యూస్‌టుడే: కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య కోరారు. కుల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో.. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న పలువురిని గురువారం ఇందిరాపార్కులో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులాంతర, మతాంతర వివాహితులకు చట్టపరంగా రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజాగాయకుడు జైరాజ్ మాట్లాడుతూ, పరువు హత్యల నివారణ కోసం ఒక కమిటీ ఉండాలని సూచించారు. హేతువాది పెన్మత్స సుబ్బరాజు మాట్లాడుతూ, సంబంధిత వివాహాలు చేసుకున్న వారు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్‌నూ ఏర్పాటు చేయాలన్నారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారి పిల్లలను ఆదర్శవంతులుగా గుర్తించి విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కె.గోవర్ధన్ కోరారు. కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘం అధ్యక్షుడు ఎండీ వహీద్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిడ్డి సుధాకర్, జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి రమేష్, కులనిర్మూలన సంఘం ప్రతినిధులు బీబీ బాషా, డీఎల్ కృష్ణచంద్, లక్ష్మీనాగేశ్వర్, గుత్తా జ్యోత్స్న, టీపీఎస్‌కే కన్వీనర్ జి.రాములు, మానవ వికాస వేదిక జాతీయ అధ్యక్షుడు సాంబశివరావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, సమత మిషన్ ప్రతినిధి వీఆర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్