logo

పచ్చపచ్చగ.. నగరం మెచ్చగ

భావితరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణమని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్‌ నర్సరీ మేళాను మంత్రి ప్రారంభించారు. 

Published : 27 Jan 2023 03:58 IST

మొక్కలను పరిశీలిస్తున్న మంత్రి తలసాని

ఖైరతాబాద్‌: భావితరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణమని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. గురువారం పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్‌ నర్సరీ మేళాను మంత్రి ప్రారంభించారు.  వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టి ఏటా కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మేళాలో అరుదైన మొక్కలతోపాటు పరికరాలు, కుండీలు, ఎరువులను ఆయా సంస్థలు ఏర్పాటుచేశాయి. నగరవాసులు ఈ మేళాను సందర్శించాలని మంత్రి సూచించారు.నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులు ఖాలిద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రదర్శన ఈనెల 30వరకు రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు.

మేళాకు విచ్చేసి సెల్ఫీ దిగుతున్న సందర్శకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు