logo

సీపీఆర్‌ ఇలా.. ప్రాణం పోశానిలా

ప్రతి ఒక్కరికి సీపీఆర్‌ ఎలా చేయాలో తెలిసుండాలని, అలా చేయడం ద్వారా అంబులెన్స్‌ వచ్చేదాకా గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడొచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Updated : 28 Jan 2023 04:30 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

సీపీఆర్‌ చేసి చూపిస్తున్న గవర్నర్‌ తమిళిసై

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికి సీపీఆర్‌ ఎలా చేయాలో తెలిసుండాలని, అలా చేయడం ద్వారా అంబులెన్స్‌ వచ్చేదాకా గుండెపోటు వచ్చిన వ్యక్తిని కాపాడొచ్చని గవర్నర్‌ తమిళిసై అన్నారు. గాంధీ మెడికల్‌ కళాశాల అలుమ్నీ అసోసియేషన్‌, గ్లోబల్‌ అలియన్స్‌, అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్నీ భవనంలో జరుగుతున్న సీపీఆర్‌ (కమ్యూనిటీ హ్యాండ్స్‌ ఆన్‌ కార్డియోపల్మనరీ రిసక్టేషన్‌) అవగాహన శిబిరాన్ని గవర్నర్‌ తమిళిసై సందర్శించారు. ఈసందర్భంగా ఆమె సీపీఆర్‌ చేసే విధానాన్ని చేసి చూపించారు. అనంతరం మాట్లాడుతూ.. తాను వైద్యురాలినని, కొన్ని రోజుల క్రితం విమానంలో వెళ్తుండగా ప్రయాణికుల్లో ఒకరికి గుండెపోటు వచ్చిందని, తాను వెంటనే సీపీఆర్‌ ద్వారా అతని ఛాతీపై రెండు చేతులతో 120 సార్లు, 5 సెంటిమీటర్ల లోతు వెళ్లేలా ఆగకుండా నొక్కడం వల్ల అతని గుండె కొట్టుకోవడంతోపాటు, మెదడుకు ఆక్సిజన్‌ అందిందని వివరించారు. తర్వాత కొన్నిరోజులకు అతను తన కార్యాలయానికి వచ్చి తాను ఐఏఎస్‌ అధికారినని పరిచయం చేసుకున్నారని,  కృతజ్ఞతలు చెప్పారన్నారు. డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంటు రాజారావు, నిర్వాహకులు నాగార్జున చక్రవర్తి, డెన్నిస్‌ మెకాలే(షికాగో), రవీందర్‌ సురకంటి, జీఆర్‌ లింగమూర్తి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని