కదిలే పెట్టె.. కథలు చెప్పె!
చరవాణి, అంతర్జాలం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పుస్తకం జోలికెళ్తే ఒట్టు.. ఎప్పుడూ రీల్స్, యూట్యూబ్ అంటూ పరుగులుపెట్టే వారే తప్ప పఠనంపై ఆసక్తి చూపేవారు లేరు.
స్టోరీబాక్స్ యంత్రాన్ని రూపొందించిన నగర మహిళ
కథల పెట్టెతో అపర్ణ విశ్వనాథ్
ఈనాడు, హైదరాబాద్: చరవాణి, అంతర్జాలం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పుస్తకం జోలికెళ్తే ఒట్టు.. ఎప్పుడూ రీల్స్, యూట్యూబ్ అంటూ పరుగులుపెట్టే వారే తప్ప పఠనంపై ఆసక్తి చూపేవారు లేరు. ఈ క్రమంలో చిన్నారుల్లో పఠనాసక్తి, పుస్తకాలపై ఇష్టం పెరిగేలా స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేక యంత్రాన్ని నగరానికి చెందిన అపర్ణ విశ్వనాథ్ తయారు చేశారు. ఫ్రాన్స్‌కు వెళ్లిన సమయంలో యంత్రాన్ని చూసి ఇక్కడి పిల్లలకు నచ్చేలా డాటాబేస్.. అందుకనుగుణంగా లఘుకథలకు అందించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్‌లను ఉపయోగించి ‘స్టోరీ బాక్స్’ యంత్రాన్ని రూపొందించారు. శుక్రవారం సైఫాబాద్‌లోని విద్యారణ్య స్కూల్‌లో ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్-2023’లో ఈ మినీ యంత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
అప్పుడే ఆలోచన వచ్చింది...
ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అపర్ణ.. ఎంబీఏ పూర్తి చేశారు. ‘సంజీవయ్య పార్కు వద్ద ఉన్న డూ సైన్స్’లో భాగమయ్యారు. ఆ సమయంలోనే చిన్నపిల్లలకు కార్యశాల నిర్వహిస్తూ.. వారికి పఠనాసక్తి లేదని గమనించారు. ఇందుకోసం ఏదైనా కొత్తగా తయారు చేయాలని భావించారు. అప్పుడే ఫ్రాన్స్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కనిపించిన మినీ యంత్రం ఆమెను కట్టిపడేసింది. అదే స్ఫూర్తితో 2019 డిసెంబర్‌లో దీనిని తయారు చేయడం ప్రారంభించారు. పలు దశల తర్వాత ఈ యంత్రం మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలోని 30 ప్రదేశాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. పాఠశాలల్లో లైబ్రరీతో పాటు కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కంటెంట్, కార్యక్రమాల్లో వక్తల ప్రొఫైల్ ఇలా.. ఏది కావాలంటే ఆ డేటాను మార్చుకునే సదుపాయం ఉంది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో సందర్శకుల సౌకర్యార్థం.. దీనిని చిన్నారుల కోసం షార్ట్‌స్టోరీస్, పార్ట్ స్టోరీస్ చదివేందుకు ఉపయోగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్