logo

సాంకేతిక నవకల్పనతో మరింత అభివృద్ధి

భారతదేశం అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ప్రధాన కారణం నవకల్పన లేకపోవడమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 28 Jan 2023 02:33 IST

  విద్యార్థులు తయారు చేసిన డ్రోన్‌ను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ నారాయణన్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారతదేశం అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు రాకపోవడానికి ప్రధాన కారణం నవకల్పన లేకపోవడమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో సిల్వర్‌జూబ్లీ టాక్‌ను ప్రారంభించారు. నవకల్పన ద్వారానే మరింత అభివృద్ధి సాధించగలమని ఆయన పేర్కొన్నారు.  ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, సభ్యులు జయేశ్‌రంజన్‌, డైరెక్టర్‌ నారాయణన్‌ అజిత్‌ రంగ్నేకర్‌, శ్రీనిరాజు, చంద్రశేఖర్‌, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లింబాద్రి, అధ్యాపకులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని