logo

మాతృభూమిని.. మాతృభాషను మరవద్దు

ఉద్యోగరీత్యా ఏ దేశం వెళ్లినా.. మన మాతృభూమిని, కన్నతల్లి లాంటి మన మాతృభాషను మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 28 Jan 2023 02:59 IST

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు

మియాపూర్‌, న్యూస్‌టుడే: ఉద్యోగరీత్యా ఏ దేశం వెళ్లినా.. మన మాతృభూమిని, కన్నతల్లి లాంటి మన మాతృభాషను మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు అమ్మభాష అని, అమ్మను అమ్మ అని పిలవడంలో ఎంతో గొప్పతనం దాగి ఉందన్నారు. కొండాపూర్‌లోని విజ్ఞాన్స్‌ వరల్డ్‌వన్‌ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రకృతిని ప్రేమించి గుణాన్ని నేర్పాలని, తద్వారా వారు చక్కని మనస్తత్వంతో సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించగలుగుతారన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తప్పులు చేసినప్పుడు విమర్శించకుండా, తప్పులను సవరిస్తూ వారితో స్నేహితుల్లా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెలగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డా.లావురత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల వైస్‌ఛైర్‌పర్సన్‌ రాణి రుద్రమదేవి, ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డా.సందీప్‌ క్రాంతి కిరణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని