పూల సోయగం.. విదేశీ సౌరభం
బంతి.. చామంతి.. గులాబీలు విరబూశాయి.. కుండీల్లో మినేచర్ చెట్లకు కాసిన నిమ్మ, బత్తాయి, మామిడికాయలు భలేగా ఉన్నాయి.
పీపుల్స్‌ప్లాజా నర్సరీ మేళాలో కొలువుదీరిన వేల మొక్కలు
ఈనాడు, హైదరాబాద్
పూల మొక్కల శోభ
బంతి.. చామంతి.. గులాబీలు విరబూశాయి.. కుండీల్లో మినేచర్ చెట్లకు కాసిన నిమ్మ, బత్తాయి, మామిడికాయలు భలేగా ఉన్నాయి. శీతల ప్రదేశంలో పండే ఆపిల్ మొక్కలు, ఎప్పుడూ చూడని నల్లని మామిడి, నల్ల జామచెట్లు.. ఇలా ప్రతిదీ ఇంటికి తీసుకెళ్లి పెరట్లో నాటుకోవాలి అన్నంతగా చూపరులను కట్టిపడేస్తున్నాయి. నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో వేల సంఖ్యలో కొలువుదీరిన అలంకరణ, ఔషధ, ఎడారి మొక్కలు, అరుదైన రకాలు కళకళలాడుతున్నాయి.
ఎక్కడైనా పెంచుకునేలా.. వేసవి మొదలు కాబోతుంది. ఈ సమయంలో మొక్కలను సంరక్షించుకోవడం అంత సులువైన పనేమి కాదు. కానీ ఇంటిపైన, ఆవరణలో పచ్చని మొక్కలు ఉంటే వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అలంకరణ మొక్కలతో పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవచ్చు.
* ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి కుండీల్లో, కవర్లలో, నిటారుగా స్టాండ్లలో మొక్కలను పెంచుకోవచ్చు.
* బాల్కనీల్లో ఎక్కువ స్థలం ఆక్రమించకుండా ఒకవైపు పెంచుకునేలా స్టాండ్స్ ఉన్నాయి. తీగ జాతి రకాలను పెంచుకోలేకపోతున్నామనే బెంగ అక్కర్లేదు. వీటికీ స్టాండ్స్ వచ్చాయి.
* మట్టి, కోకోపిట్‌తోనూ పనిలేకుండా నీటిలో మొక్కలు పెంచే హైడ్రోఫొనిక్స్ విధానంలో తాజా ఆకుకూరలను పెంచుకోవచ్చు.
* ఔషధ మొక్కలు.. తులసి, ఇలాచీ, అల్లం, సర్పగంధ, నీలవేము, తిప్పతీగ, పిప్పాలి రకం మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
* మలేషియన్ ఆపిల్, థాయిలాండ్ జామ, పనస తదితర విదేశీ మొక్కల్ని సైతం విక్రయిస్తున్నారు.
* ట్రేలో చిన్న మొక్కలు రూ.10 నుంచి రూ.20, కవర్లలో పెంచినవి రూ.50, రూ.100 కు విక్రయిస్తున్నారు. అరటి మొక్కను రూ.20కు ఉద్యానశాఖ విక్రయిస్తోంది.
అడినియమ్స్ ఆకర్షణ
అడినియమ్స్ మొక్కలు.. బోన్సాయ్ వృక్షంలా ఉంటాయి.. పూలు పూస్తాయి. ఆకులు పెద్దగా ఉండవు. చూడటానికి బొద్దుగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. తక్కువ నీటితో ఎక్కువ రోజులు బతుకుతాయి. వీటి జీవితకాలం కూడా ఎక్కువే. ఈ తరహా ఎడారి మొక్కలతో మీ ఇంటి గార్డెన్ కళకళలాడుతూ ఉంటుందని నర్సరీ నిర్వాహకులు అంటున్నారు. వీటి నిర్వహణ తేలికని.. ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయని చెబుతున్నారు.
* ఇసుక 50 శాతం, మట్టి 30 శాతం, పశువుల ఎరువు/వర్మీ కంపోస్టు 20 శాతం మిశ్రమం కలిపి కుండీలలో నాటుకుంటే సరిపోతుంది.
* అడినియం అరబికం, థాయ్‌సోకోట్రానమ్, సోమాలియన్స్, డోర్ సెట్‌హార్న్ అడినియం, డ్వార్ఫ్ రకాలు మేళాలో దొరుకుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం
-
Ts-top-news News
MLC Kavitha: కవిత సెల్ ఫోన్లలోని డేటా సేకరణ
-
Ts-top-news News
Indian Railway: రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక