logo

కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి: సుద్దాల అశోక్‌తేజ

విద్యార్థుల్లో మనోవికాసం పెంపొందించాలని, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు.

Published : 28 Jan 2023 02:59 IST

మాట్లాడుతున్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ. చిత్రంలో అనూహ్యరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వెంకటరమణ, సోమన్న, రమేష్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో మనోవికాసం పెంపొందించాలని, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సుందరయ్య కళానిలయంలో తెలంగాణ బాలోత్సవం, పిల్లల జాతర- 2023 కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. బాల సాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ   సైన్స్‌ విషయాల్లో విద్యార్థులను చైతన్యం చేయాలన్నారు.  పర్యావరణంపై అవగాహన, సైన్స్‌ విజ్ఞానం, పల్లె సుద్దులు, సమ్మక్క- సారక్క జాతర, బతుకమ్మ, కోలాటం, జానపద నృత్యాలు, లఘు నాటికలు, ఏకపాత్రాభినయం, విచిత్ర వేషధారణలు, దేశభక్తి, అభ్యుదయ గీతాలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, కథలు చెప్పడం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించారు.  సినీ నిర్మాత అనూహ్యరెడ్డి, విద్యావేత్త సీహెచ్‌ వేణుగోపాల్‌రెడ్డి, రచయిత భూపతి వెంకటేశ్వర్లు, బాలోత్సవం కార్యదర్శి సోమయ్య, విజ్ఞాన దర్శిని కన్వీనర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు