logo

ఏ దేశమేగినా..జన్మభూమిని మరవొద్దు

మాతృభాషను విస్మరిస్తే తల్లిదండ్రులను మరిచిపోయినట్లేనని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ప్రసంగిస్తున్న వెంకయ్యనాయుడు

నిజాంపేట(హైదరాబాద్‌), న్యూస్‌టుడే: మాతృభాషను విస్మరిస్తే తల్లిదండ్రులను మరిచిపోయినట్లేనని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్థానిక బాచుపల్లిలోని వీఆర్‌ఎస్‌ విజ్ఞానజ్యోతి స్కూల్‌ 27వ వార్షికోత్సవం శనివారం సాయంత్రం జరిగింది. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు విద్యాభ్యాసం నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలన్నారు. యోగా వంటి ఆసనాలను ఆచరించాలన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా ఫరవాలేదని, అయితే మన మాతృభాషైన తెలుగును విస్మరించొద్దన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులతో పాటు పాఠశాల సిబ్బంది కృషి చేయాలన్నారు. విద్యార్థులు బంగారు భవితకు పునాదులు వేసుకుని ప్రపంచస్థాయికి ఎదగాలని సూచించారు. అయితే ఎంత ఎదిగినా సొంత గడ్డకు తిరిగి సేవ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రదానం చేశారు. కల్నల్‌ రంజిత్‌ చాకో మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న వీఆర్‌ఎస్‌ విజ్ఞానజ్యోతి విద్యాసంస్థ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ వల్లూరుపల్లి రాజారామ్మోహన్‌రావు, ట్రస్టీలు రాజశేఖర్‌, రాజ్‌కుమార్‌, డైరెక్టర్‌ కొడాలి విజయారాణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని