logo

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయండి

ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన డీజీపీ కార్యలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

Published : 29 Jan 2023 02:35 IST

డీజీపీ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం

చికిత్స పొందుతున్న భానుప్రకాశ్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన డీజీపీ కార్యలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయం వైపు దూసుకొచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించారు. అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ గాయపడి స్పృహతప్పి పడిపోవడంతో ఆయన్ని స్థానిక గ్లోబల్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన అరుణ్‌కుమార్‌, పుల్లెలశివ, మరికొందరు సైతం చికిత్స పొందుతున్నారు. కరీంనగర్‌ పర్యటనలో ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఫోన్‌లో భానుప్రకాశ్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భానుప్రకాశ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కారు ప్రశ్నించేవాళ్లను అణిచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టైన వారిని సాయంత్రం విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని