logo

బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి

బీసీ సంక్షేమాన్ని భారాస సర్కారు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఖరి మారకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.

Published : 29 Jan 2023 02:35 IST

ఆందోళన కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తదితరులు

ఆసిఫ్‌నగర్‌, న్యూస్‌టుడే: బీసీ సంక్షేమాన్ని భారాస సర్కారు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఖరి మారకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగుతామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. వచ్చేనెల 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. శనివారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌ ముట్టడి పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌.కృష్ణయ్య హాజరై మాట్లాడారు. బీసీ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రాధాకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జకృష్ణ, నీల వెంకటేష్‌, లాల్‌కృష్ణ, రాజేందర్‌, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని