logo

సందడిగా ఎంఎన్‌ఐటీజేఏఏ గ్లోబల్‌ అలూమ్ని మీట్‌ 2023

మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఎన్‌ఐటీ) జైపుర్‌.. దేశంలోనే ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదిగిందని ఆ సంస్థ డైరెక్టర్‌, ఎంఎన్‌ఐటీజే అలూమ్ని అసోసియేషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.పి.పాదీ పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ ఎన్‌.పి.పాదీ. వేదికపై దేవరాజ్‌ సోలంకి, రాకేష్‌జైన్‌,
ప్రమోద్‌ అగర్వాల్‌, ఎం.వి.సుధాకర్‌, వీఆర్‌ఎస్‌ రెడ్డి, ఆర్‌.నరేంద్ర తదితరులు

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఎన్‌ఐటీ) జైపుర్‌.. దేశంలోనే ఉత్తమ ఇన్‌స్టిట్యూట్‌గా అత్యుత్తమ స్థాయికి ఎదిగిందని ఆ సంస్థ డైరెక్టర్‌, ఎంఎన్‌ఐటీజే అలూమ్ని అసోసియేషన్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.పి.పాదీ పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో శనివారం ఎంఎన్‌ఐటీజేఏఏ హైదరాబాద్‌ చాప్టర్‌ గ్లోబల్‌ అలూమ్ని మీట్‌ -2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌.పి.పాదీ, హైదరాబాద్‌ రీజినల్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ ఎంవీ సుధాకర్‌ మాట్లాడారు. అనంతరం గ్లోబల్‌ అలూమ్ని మీట్‌ -2023 సావనీర్‌ను ఎంఎన్‌ఐటీజేఏఏ సెంట్రల్‌ ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ దేవరాజ్‌ సోలంకి, జనరల్‌ సెక్రటరీ రాకేష్‌కుమార్‌, డీన్‌ అలూమ్ని ఎఫైర్స్‌ ఎంఎన్‌ఐటీ ప్రొ.రాకేష్‌ జైన్‌, హైదరాబాద్‌ చాప్టర్‌ ప్యాట్రన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌, గ్లోబల్‌ అలూమ్ని కన్వీనర్‌ వీఆర్‌ఎస్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఆర్‌.నరేంద్ర, రాకేష్‌యాదవ్‌ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో అపూర్వ విజయాలందుకున్న పూర్వ విద్యార్థులకు అలూమ్ని అవార్డులు అందజేసి సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని