logo

బాలికపై పెదనాన్న కుమారుడి అత్యాచారం

వరుసకు సోదరుడయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన ప్రకారం.. అత్తాపూర్‌ సమీపంలో నివసించే ఓ బాలిక తల్లిదండ్రులు కొన్నాళ్ల కిందట విడిపోయారు.

Published : 29 Jan 2023 02:31 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: వరుసకు సోదరుడయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన ప్రకారం.. అత్తాపూర్‌ సమీపంలో నివసించే ఓ బాలిక తల్లిదండ్రులు కొన్నాళ్ల కిందట విడిపోయారు. బాలిక(13) తండ్రి వద్ద ఉంటోంది. బాలిక పెదనాన్న కుమారుడు(18) వారితో కలిసి ఉంటున్నాడు. కొన్ని రోజులుగా బాలికపై ఆ యువకుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి బాలిక గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసింది. దాంతో అత్తాపూర్‌ ఔట్‌పోస్టులో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 


బాలికపై సామూహిక అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

ధూల్‌పేట: బాలికను నిర్బంధించి ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన మంగళ్‌హాట్‌ పోలీసులు శనివారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. సీఐ కథనం ప్రకారం..మంగళ్‌హాట్‌కు చెందిన బాలిక(16) ఈ నెల 22న ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె మానసికస్థితి సరిగ్గా లేనందున అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వస్తుంటుందని తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి వరకు పట్టించుకోలేదు. రాత్రి వరకూ ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె తల్లి, మేనమామ కలిసి వెతకడం ప్రారంభించారు. చివరికి సత్తెన్నగల్లీలోని వారి కుటుంబానికి సన్నిహితుడైన రాజా(22) ఇంట్లో బాలిక కనిపించింది. బాలికను ఇంటికి తీసుకువచ్చి ఆరా తీయగా..రాజాతోపాటు జియాగూడకు చెందిన రోహన్‌(25) బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ శనివారం అరెస్టు చేశారు. బాలికపై నెల రోజులుగా కన్నేసిన రాజా, రోహన్‌ తరచూ ఆమెను ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక తన చరవాణి చోరీ చేసినందుకు ఇంటికి తీసుకువచ్చినట్లు నిందితుడు పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని